29 Eylül 2010 Çarşamba

అసత్యం నిస్సిగ్గుగా ..రాజ్యం యేలుతుంటే … సత్యం చచ్చు బడ్డ కాళ్ళ తో పరారయింది …

అసత్యం నిస్సిగ్గుగా ..రాజ్యం యేలుతుంటే …
సత్యం చచ్చు బడ్డ కాళ్ళ తో పరారయింది …
నిజమే ..ఆయేషా హంతకుడు
సత్యం బాబేనా ??
సత్యానికి ఉరి …అ సత్యానికి సగర్వ రాచమర్యాద ..
నా మిత్రుడు ఓ సందర్భం లో అన్నాడు
అసత్యం నిస్సిగ్గుగా ..రాజ్యం యేలుతుంటే …
సత్యం చచ్చు బడ్డ కాళ్ళ తో పరారయింది ……
బరితెగించిన న్యాయ వ్యవస్త నిలువెత్తు నిర్లక్ష్యానికి పరా కాష్ట..

సత్యం బాబు కు యావజ్జీవ శిక్ష..

దొంగలు దర్జాగా రాజ్యాన్ని యేలుతుంటే ..అమాయకులు
అంగట్లో …శవాలుగా.

.మారే అన్యాయ న్యాయ వ్యవస్తకు తలకొరివి పెట్టాలని ఉంది ..
ఇక నుంచి జైళ్ళు నోరు తెరుస్తాయి ..
సత్యాన్ని ..ఇక్కడ కాపాడినా ..

ఏదో ఒక రోజు ఎక్కడో ఒకచోట ..మొద్దు శ్రీను లాగా
మాయం కాక తప్పుడు..
మరణం తప్పదు ..
సోదరా ..నేను తప్పు చేస్తే
నన్ను ఉరి తీయండి అని సగర్వం గా చెప్పావే ..
నీ కున్న పాటి ధైర్యం కూడా న్యాయ వ్యవస్తకు లేదు

అది దొంగలకు సద్ది మొసేది..
నీకు తెలియదా
ఇక్కడ సమాధులు ..
గుడులు… కొంపలు కూల్చే వాళ్లకు స్తానం

నీ లాంటి వాళ్లకు కాదు

నీ సచ్చు బడ్డ కాళ్ళకు తెలుసు …
నిజమేమిటో

నీవు పారిపోయావని

నిన్ను..ఎన్కౌంటర్..చేయబోయిన

కాకి కి తెలుసు .కలిగిన వాళ్లకు అవెంత..విశ్వాస పాతంగా..ఉంటాయో
నిన్నుఏకాకిని చేసిన వ్యవస్థ
మీద కాండ్రించి ఉమ్మాల్సింది ..
ఉరి తీయమంటవా…..