హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంవూదంలో ‘ఉరిశిక్షల రద్దు పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ చాలా ఉత్తేజకరంగా జరిగింది. వర్షంలో ఎవరు వస్తారులే అనుకుంటూ సమావేశానికి బయలుదేరాను. జోరున వర్షం కురుస్తున్నా సభ జరుగుతున్న హాల్ కిక్కిరిసిపోయింది. ఎందుకో రాజ్యం ఇంత కసాయిగా ఉన్నా ‘పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు’ .. ఆ సమావేశానికి వచ్చి న సంఖ్య చూస్తే చాలా ఆశ కలిగింది. దాదాపు నాలుగు ఏళ్ల కింద ట జార్ఖండ్ ముఖ్యమంత్రి బాబులాల్ మరాం డి కుమారుడి మీద జరిగిన దాడిలో అతని కొడుకుతో పాటు మరి కొంతమంది మరణించారనే అభియోగంతో, ఆ దాడిలో పాల్గొన్నారని ఛత్రపతిమండల్, మనోజ్ రజ్వార్, అనిల్ రాం, జీతన్ మరాండీలకు ఉరి శిక్ష పడింది. దీనికి నిరసనగా జరిగిన సభకు వరవరరావు, గద్దర్, బీడీ శర్మ, విప్లవ కవి శివాడ్డి, జీతన్ మరాండీ సహచరి అపర్ణా మరాండీ, విస్తాపన విరోధ్ మంచ్ ప్రతినిధి వినోద్ తదితరులు హాజరయ్యారు. హాల్ అంతా నిండిపోయింది.
ఈ మధ్య అంత పెద్దసంఖ్యలో అందునా జోరున వర్షం కురుస్తున్నా హాజరవడం బహుశా ఇదే మొదటిసారేమో. లోపల ఎంతమంది ఉన్నారో అంతమంది, లోపల చోటులేక బయ నిలబడ్డారు. కూర్చోవడానికి సీట్ వెతుక్కోవడానికి చాలా కష్టపడ్డాను. తన ఏడాది కొడుకునెత్తుకొని కళ్లలో అంతులేని ఆశతో భవిష్యత్తుమీద అచంచలమైన భరోసాతో శత్రువుమీద దూకడానికి సిద్ధంగా ఉన్న సివంగి లా అపర్ణా మరాండి కనిపించింది. నా సీట్ పక్కనే తన కొడుకుని ఎత్తుకొని ఒళ్లో పెట్టుకొని అమాయకంగా కూర్చొంది. మన నిర్వాహకుల తెలుగు ప్రసంగాలు అర్థంగాక నన్ను పిలిచారా లేదా అనే ఆమె తొట్రుపాటు గమనించాను. చాలా సాదా సీదాగా, ఎముకల గూడులా ఉన్న ఆమెను చూస్తే అంత గొప్ప కళాకారిణిగా అనిపించదు. ఆమె మీద నాకు గౌరవం పెరిగింది.
అదే సందర్భంలో.. పాట అంగట్లో అమ్మకపు సరుకై, ఎలక్షిక్టానిక్ మీడి యా యజమానుల దగ్గర ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటున్న కొంతమందిని చూస్తేజాలి వేసింది. జీతన్ మరాండీ ఈరోజు ఎందుకు ఉరికంబానికి ఎక్కుతున్నాడు?ఎందుకంటే.. ప్రజల నోటికాడి కూడు, నీడ దోచుకుంటున్న దోపి డీ శక్తుల గుట్టు బయట పెట్టినందుకే అపర్ణా మరాండీ సహచరుడు ఉరికంబం ఎక్కాల్సి వచ్చిం ది. ఎప్పటి నుంచి ఈ పరంపర మొదలయ్యిం ది? వాళ్లు లాహోర్ కుట్రకేసులో పాల్గొన్న వాళ్లు కావచ్చు. అంతర్జాతీయ ఆయిల్ మాఫియా ‘షెల్’ కంపె నీ దురాగతాలకు ఉరికంబమెక్కిన కేంసారో వివా కావచ్చు. అమెరికన్ సామ్రాజ్యవాదులు బలిగొన్న సక్కో వాంజెట్టీ కావచ్చు. తెలంగాణ జైత్రయాత్ర భూమిపువూతులు భూమ య్య, కిష్టాగౌడ్ కావచ్చు. నేడు నేను కావ చ్చు. రేపు మీరూ కావచ్చు. ఇలా రాజ్యహింసలో ఎందరో బలయిపో యారు.
ఇంకా ఎంతకాలం ఈ మానవ హననాలు? ఈ ప్రశ్నలు ముప్పిరిగా నా మనసులో తొలుస్తున్నాయ్. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేసిన కసాయి తనం ఆమె కళ్లల్లో కన్పించింది. ఆమె చేతుల్లో ఉన్న ఏడాది వయసు బిడ్డను ఎత్తుకొని వాణ్ణి నిద్రపుచ్చుతూ తోటి కళాకారుల గజ్జెల సవ్వడి చూసి ఊగిపోయింది. తనూ, తన సహచరుడు ఆ గజ్జెలతో ఎన్ని వందల ఊళ్లను మేల్కొలిపి ఉంటా రు? ఇంకొన్ని రోజుల్లో తన కొడుకు తండ్రి లేని అనాథ అయినా తన కొడుకులా మరే కొడు కూ నీడలేని వాడు కావద్దని దేశమంతా సంచారిలా తిరుగుతోం ది. అందరినీ సంఘటితం చేసే పనిలో ఉందామె. రాజ్యం కత్తుల వంతెన మీద సవారి చేస్తున్న ఆమెను చూస్తే ఆపాటి త్యాగంలో ఒక పైసా వంతు అయినా ఈ దేశ మేధో వికాసవంతులు చేస్తున్నారా? అనిపించింది. ప్రశ్నించే వాళ్లను అభివృద్ధి నిరోధకులని లక్షల రూపాయలు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న వాళ్లు, బహుళజాతి కంపెనీల మోచేతి నీళ్లు తాగే ఎన్‌జీఓలు పిల్లి కూతలు కూస్తున్నారు. ఆమె ప్రసంగాన్ని విశ్వవిద్యాలయంలో ఉన్న కుహ నా మేధావులతో గోడ కుర్చీ వేయించి వినిపించాలని పించింది. ‘అంతర్జాతీయ విపణిలో భారతమాత అంగాంగం తాకట్టు పెట్టబడుతోంది’ అని ప్రజాకవి చెరబండ రాజు చెప్పిన విషయాన్ని అపర్ణ మరాండీ అంటూంటే.. గర్వపడ్డాను. జాతీయ, అంతర్జాతీయ దోపిడీ దారులు వందల ఏళ్లుగా సమస్త వనరులను దోచుకున్నారు.
నేడు వాళ్ల దృష్టి భూమి అడుగున ఉన్న విలువైన బాకె్సైట్ మీద పడ్డది. దానికి అక్కడ ఉన్న ఆదివాసులు అడ్డుగా ఉన్నారని వాళ్లను భౌతికంగా నిర్మూలించడానికి సిద్ధమయ్యారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీ గిరిజనులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. మానవరహిత విమానాలతో యుద్ధసన్నాహాలు చేస్తున్నారు. జార్ఖండ్ నుంచి వచ్చిన ‘విస్తాపన్ విరోధి మంచ్’, జీతన్ మరాండీ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘అభేన్ సాంస్కృతిక సంస్థ’ నుంచి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలను దుయ్యబట్టారు. చూస్తే అమాయకంగా కనిపించిన అపర్ణా మరాండీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి దారులు జల్, జమీన్, జంగిల్ మీద ఆదివాసీలకు కనీసం హక్కులేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఖనిజాల తవ్వకం కోసం ఆదివాసులను అక్కడినుంచి తరిమేసే పనిలో ఉన్నారని, దాన్ని ప్రశ్నించిన వాళ్లను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్జె కట్టి పాటపాడే ఆదివాసుల మీద , వాళ్ల కలాల మీద, గళాల మీద ఆంక్షలు ఆక్షేపణీయమని అన్నారు. జిందాల్, మిట్టల్, అభిజిత్ లాంటి సంస్థ లు మైనింగ్ మాఫియా అవతారమెత్తి లక్షలాది మంది ఆదివాసులను నిర్వాసితుల్ని చేస్తున్నాయని అపర్ణా మరాండీ తెలిపారు.
ఈ క్రమంలో వందలాదిమంది చనిపోయారని, ఎంతో మంది కనిపించకుండాపోయారని ఆమె వాపోయారు. ప్రశ్నించిన కళాకారుల కు ఉరిశిక్షలు వేస్తున్నారని, ఇవాళ తన సహచరుడు జీతన్ మరాండీ కూడా ఆ కుట్రకు బలయ్యారని తెలిపారు. ఇది వ్యక్తిగతంగా జీతన్ మరాండీ మీద పెట్టిన కేసు, వేసిన ఉరి శిక్షగా అనుకోవడం లేదనీ, ఇది ఆదివాసీ ఉద్యమాలను అంతం చేయడానికి మైనింగ్ మాఫియా చేసిన దాడిగా చూడాలని పిలుపునిచ్చారు. వందల ఏళ్లుగా ఆదివాసులు అటవీ సంపద హక్కు భుక్తంగా చేసుకొని బతుకుతున్నారు. నేడు వాళ్ల ఉనికికే ప్రమాదం వచ్చిందని అన్నారు. ఇవ్వాళ దేశంలోని బుద్ధిజీవులంతా.. మైనింగ్ మాఫియా, బహుళజాతి కంపెనీల దోపిడీని ప్రశ్నించి ఎదిరించకుంటే.. అందరికీ ఉరితాడే మిగులుతుందని హెచ్చరించారు. ఇవ్వాళ భారత ప్రభుత్వానికి ఈ నేల వాసుల ప్రయోజనా ల కన్నా మైనింగ్ మాఫియా ప్రయోజనాలే ముఖ్యమని దానికి వ్యతిరేకం గా దేశంలోని ప్రజాస్వామికవాదు లు, మేధావులు సంఘటితంగా ఐక్య ఉద్యమాలు తీవ్రతరం చేయాలని అపర్ణా మరాండీ కోరారు. ఉరి శిక్షల రద్దు కోసం జాతీయంగా, అంతర్జాతీయం గా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, అమానవీయమని అంటున్నా.. మన ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని విమర్శించారు.
ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో రాజీవ్ హంతకులకు ఉరిశిక్ష రద్దు చేయాలని అక్కడి అసెంబ్లీ తీర్మానం చేయడం ఆహ్వానించదగిందని అన్నారు. మరి మనమిక్కడ ఏం చేస్తున్నాం. ‘సామాన్యుల్ని శవాలుగామార్చి, పోలీసులు మిలిటరీ సాయంతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జులుం, జబర్ దస్తీలే న్యాయం, ధర్మం అని బుకాయించి, దబాయించి అధికారం చెలాయిస్తుంటే మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, విద్యార్థులు అంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేక భయానికి తలొంచుకుంటున్నారా?’ అని రావిశాస్త్రి ఎప్పుడో ఇందిరమ్మ అత్యవసర పరిస్థితుల్లో అన్నారు. సరిగ్గా ఇవ్వాళ తెలంగాణలో ప్రతిరోజూ పరిస్థితి ఎమ్జన్సీని తలపిస్తోంది. నేడు తెలంగాణ కూడా అంతరంగిక భద్రతా చట్టంలోకి మారిపోనుందా..? ఏమో??
-గుర్రం సీతారాములు
రీసెర్చ్ స్కాలర్