14 Ekim 2011 Cuma

అవకాశ వాద ఒప్పందాలు తెలంగాణా

ప్రతేక తెలంగాణా ఉద్యమనం నేడు అందరు అనుకున్నట్లు తుది దశకు చేరిందని బావించినా వాస్తవానికి అది కోస్తాంద్ర పెట్టుబడి దారులతో మమేకమయిన అంతర్జాతీయ పెట్టుబడి దారులు వాళ్ళ దోపిడీకి తలుపులు బార్లా తెరిచి ఉంచిన యూపీఏ కబంద హస్తాలలో బిక్కు బిక్కు మంటోంది దోపిడీ శక్తులన్నే ఎలాగయినా దీన్ని రూపు మాపాలని రాజీనామాల నాటకానికి తెర దీసింది. అందరు అనుకున్నట్లు రాజకీయ శూన్యత తెచ్చినట్లయితే కేంద్రం దిగి వస్తది అని భావించిన తెలంగాణా వాదులకు ఇది ఆశనిపాతం . ఒకరకంగా చెప్పాలంటే జాతీయ రాజకీయ అడ్డంకుల కంటే అంతర్జాతీయ కార్పోరేట్ లాబీనే తెలంగాణాను అడ్డుకుంటోంది. దీనికి ప్రదాన కారణం ఈ రాష్ట్ర పెట్టుబడి దారి వర్గం మరియు పాలక వర్గం ఒకటి కావడమే . అందునా కోస్తాంద్ర పెట్టుబడి దారులు కేంద్రం లో పార్ల మెంటరీ రాజకీయాలను శాసించే శక్తులు కావడమే కారణ. దీని వలన రేపు తెలంగాణా వచ్చినా పెట్టుబడీ దారి వర్గ ఆకాంక్షలకు అనుగుణం గానే ఉంటది . ఈ క్రమంలో ప్రజా ప్రతినిదుల రాజీనామా ఒక నిరసన రూపం అయినప్పటికీ విశాల ప్రజానీకం ప్రజా సంఘాలు విద్యార్థులతో ఐక్య ఉద్యమాలు నిర్మించడం లో అన్ని వర్గాల శక్తులు వైఫల్యం చెందాయి . కేంద్ర ప్రకటన కేవలం రాజీనామాల ద్వారానే వచ్చేతట్లయితే ఈ పాటికి ఎప్పుడో అది వచ్చిఉండాలి ఇంతమంది ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసినా ప్రక్రియ ముందుకు సాగటం లేదంటే దీని వెనుక లోపాన్ని లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. తెలంగాణా ఉద్యమం విశాల ప్రజా ఉద్యమం గా మారినా విజయం వైపు ఎందుకు ప్రయాణించడం లేదు అనేది కూలంకుశం గా చర్చించాల్సిన అవసరం ఉంధీ. ఎందుకంటె ఇక్కడ రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధులు సాంకేతికంగా కొందరు ఇంకా మంత్రులుగా ఉన్నట్లే దీనికి కారణం రాజీనామాలు అధిష్టానం కనుసన్నలలోనే జరిగినవి అనే అనుమానం రాక మానదు. దీని ద్వారా పచ్చి తెలంగాణా వ్యతిరేకులతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు మళ్ళీ గ్రామాలలో స్వేచ్చగా తిరిగే వెసులుబాటు మాత్రము కలిగించుకున్నారు. తెలంగాణా సాధనలో జరిగిన పచ్చిమోసం ఇది . ఈ మోసాలు కుట్రలు నాలుగు దశాబ్దాలుగా నెత్తురోడుతున్న తెలంగాణాకు ఇది కొత్తకాదు. దీని మూలాలు తొలిదశ లో జరిగిన ఉద్యమము అప్పుడు జరిగిన ఒప్పందాలు మళ్ళీ పునరా వ్రుతమయ్యే అవకాసం లేక పోలేదు. నాడు చెన్నారెడ్డి సారద్యం1969 లో వెల్లువలా వచ్చిన తెలంగాణా ఉద్రితి తద్వారా ఆ త్యాగాల పునాదుల మీద రాజకీయ సౌదాలు నిర్మించుకున్న దుస్టాన్తాలు కోకొల్లలు ఆక్రమంలో దానికి సమాంతరం గా వచ్చిన నక్షల్బరి ఉద్యమం దానికి ఒక సై ద్దాంతిక భూమిక ను ఇచ్చింది దానిని ఒక ప్రజాస్వామిక డిమాండ్ గా మార్చి దాన్ని ప్రజా ఉద్యమం గా తీర్చిదిద్దారు , వందల మంది విద్యార్థుల రక్తతర్పణం తో రాజకీయ సౌదాన్ని నిర్మించుకున్న చెన్నారెడ్డి నాయకత్యం చర్చల పేరుతొ కేంద్రం తో చేసుకున్న ఒడంబడిక ఒప్పందాలు అన్నీ అవకాశవాద ఒప్పందాలే. ఆనాడు ఉద్యమ కారులకు కేంద్ర ప్రభుత్వానికి జరగాల్సింది పోగా అవకాశవాద రాజకీయ నాయకులకు ప్రయోజనాలు నెరవేర్చే ఒప్పందం గా మారింది. అదొక అదికార మార్పిడి తంతుతో బలమయి ప్రజల ఆకాంక్షను పురిట్లోనే పీక నులిమింది తెలంగాణా నాయకత్వం .దాని తదనంతరం ప్రత్యెక ఉదయంలో కీలకం గా పాల్గొన్న విద్యార్థి, మేధో వర్గం ఆ ఉద్యమ కొనసాగింపు క్రమలోనే అడవి బాట పట్టారనేది దాచేస్తే దాగని సత్యం.

ఇక రెండవ దశలో అంటే 1995 గ్రామాలలో భూమి ఇరుసుగా సాగిన నక్షల్బ రీ ఉద్యమ ఉద్రితి మూలంగా అలిసి పోయిన భూస్వామ్య కమ్మ ,రెడ్డి, వెలమ పెత్తందారి వర్గం ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక నగరాల బాట పట్టారు. దొరలు గ్రామాలను వదిలినపటికీ దోపిడీ రూపం మళ్ళీరాజకీయ ముసుగు వేసుకొని గ్రామాలలో కి ప్రవేశించింది. ఈ దశలో అది కాపిటలిస్టు ముసుగులో తెలుగు దేశంతో కమ్మ వర్గం , రెడ్డి , మిగతా పెత్తందారీ శక్తులు కాంగ్రెస్ తో మమేకమయి రాజకీయాలను కార్పోరేటీకరించారు. వాళ్ళ రాజకీయ ప్రదాన ద్రుష్టి కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పడం అంతర్జాతీయ స్తాయిలో వాళ్ళ రాజకీయ ప్రయో జనాలను నిలబెట్టుకోవడం . ఈ దశలో ప్రజలలో ఉన్న తెలంగాణా ఆకాంక్షను బలిసిన కాపిటలిస్టు పూర్తిగా అదిమి పెట్టగలిగింది అయినా తెలంగాణా జన సభ , తెలంగాణా కళాసమితి , తెలంగాణా ఐక్యవేదిక, తెలంగాణన మహాసభ , తెలంగాణా స్టూడెంట్ ఫ్రంట్ గ్రామాలలో చైతన్య యాత్రలను నిర్మించి ప్రజల ఆకాంక్షలకు ఒక నిర్మాణాన్ని ఎర్పరచినప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వ ౦ బెల్లి లలిత. ఐలయ్య ను పాశవికంగా హత్య చేసి బయోత్పాతుల్ని చేసింది . ఇవ్వాళ తెలంగాణా పేరుతొ రాజకీయ ముసుగు వేసుకున్న ఉద్యమ పార్టీలకు ఈ చరిత్ర తెలియంది కాదు .

దీంతో పాటుగా తర్వాత దశలో కోస్తాంద్ర కాపిటలిస్టు ముసుగుకు సామ్రాజ్యవాదం తోడయింది విజన్ 2020 పేరుతొ సంస్కరణల ముసుగులో అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు ప్రభుత్వ్యం బూటకపు వాగ్దానాలతో కోస్తాంద్ర కమ్మ పెట్టుబడి దారీ వర్గం సామ్రాజ్య వాదానికి అంతర్జాతీయ పెట్టుబడి దార్లకు తలుపులు బార్ల తెరిచింది . తెలంగాణలో ఉన్న సమస్త వనరులను కోస్తా ఆంద్ర పాలక వర్గం లూటీ చేసింది . తెలంగాణా ఉద్యమం ను యావత్ నాల్గు కోట్లమంది ఒక జాతీయ విముక్తి పోరాటంగా తీర్చి దిద్ది నప్పటికీ పెట్టుబడి దారులేపాలక వర్గం ముసుగు లో ఉండడం మాలంగా విశాల ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కడం వాళ్లకు అంత కష్టమయిన విషయం కాలేదు .దానికోసం కోట్లాది రూపాయలు చేతులు మారి శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ ను సీమాంద్ర కు అనుకూలంగా తెప్పించు కున్నారు .

మూడవ దశలో ఆంద్ర తెలంగాణా భూస్వామ్య వర్గం రైతాంగ సమస్యలను ప్రదాన ఎజండాగా రాజకీయ సమీకరణలు చేసి పక్క ప్యూడల్ రాజకీయాలు నడిపే రాజశేకర్ రెడ్డి స్తానిక పెత్తందారీ శక్తులతో కలిసి అధికారం లోకి వస్తే తెలంగాణా ప్రకటిస్తాం అనే భూటకపు వాగ్దానం తో అటు తెరాస తో పొత్తు పెట్టుకొని ఇటు .నక్షల్స్ తో శాంతి చర్చలు పేరుతొ రాజకీయ నరమేధం సృష్టించాడు. ఎన్నికల ముందు తెలంగాణా కోసం చేసిన వాగ్దానాల లన్నీ తుంగలో తొక్కాడు .అధికారం లోకి వచ్చినాక రాజకీయ నరమేధం సృష్టించాడు .ఏనాడు భూమి ఇరుసుగా ఉద్యమాలు ప్రజల విముక్తి కోసం నిర్మించారో అదే భూమిని అడ్డుపెట్టుకొని వందల కోట్ల రూపాయలు చేతులు మారే విదంగా రాజకీయాలు నడిపాడు .గడిచిన 5 దశాబ్దాలలో మారిన రాజకీయ పర్సిస్తితులలో సమస్త సంపద భూముల రూపంలో ఒనకూర్చుకొని హైదరాబాద్ చుట్టూ తమ రాజకీయ ఆర్ధిక సౌదాలను నిర్మించుకున్నారు. నేడు తెలంగాణా రాష్ట్ర సాదన ప్రక్రియలో ప్రాదాన అడ్దంకి సంపద అంతా వనరుల రూపంలో ఉండడమే. దీని చుట్టూ ఉన్న సంపద కు తెలంగాణలో ఇప్పటికీ రాజీనామా చేయని తెలంగాణా పెట్టుబడి దారీ వర్గం కోస్తంద్ర పెట్టుబడి దారులకు కష్టో డియన్ లు గా వ్యవహరిస్తున్నారు .ఈవాళ తెలంగాణా ప్రకటనకు కు ప్రదాన అడ్దంకి మూడు ప్రాంతాల దానం, ముకేష్ లాంటి సంపన్న శ్రేణి వర్గం . ఈ సంపన్న శ్రేణి మేడలు వంచాలని కోరుకుంటున్న ప్రత్యెక తెలంగాణా వాదులు , సామాజిక తెలంగాణా మరియు ప్రజాస్వామిక తెలంగాణా వాదులు ఒక తాటి మీదకు వచ్చి ఉద్యమ కార్యాచరణ నిర్మించడం లో వైఫ్యల్యం చెందారు

.నేడు మలివిడత తెలంగాణా పోరాటం విద్యార్థుల త్యాగాల పునాదుల మీదుగా సాదించిన డిసెంబర్ ప్రకటన, చిదంబరం మలి ప్రకటన మరింత సంస్క్షోభం లోకి నెట్టింది సీమాంద్ర పెట్టుబడి దారుల ముందు తెలంగాణా ప్రజాప్రతినిదుల రాజీనామాలు నిలబడ లేక పోయాయి రాజీనామాల ద్వారానే రాష్ట్రం సంక్రమిస్త ది అనుకుంటే ఈ పాటికి ప్రకటన వచ్చ్చి ఉండాలి . సామాజిక తెలంగాణా కోరుకొనే శక్తులన్నే
ఉత్పత్తి శక్తులను ఐక్యం చేయడం లో ఉద్యమ సంఘాలు, మేధో వర్గం దారుణంగా వైఫల్యం చెందాయి.

ఉత్పత్తి శక్తుల అనైక్యత వల్ల వాళ్ళను పైన పేర్కొన్న మూడు ఉద్యమ స్రవంతులు, రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిదులు కలిసి ఐక్య సంఘటన ఇంకా ఏర్పాటు చేయక పోవడం ప్రస్తుత ఉద్యమ ప్రదాన లోపం. ఉద్యమ , ఉద్యోగ , ప్రజాసంఘాలకు, పోలిటికల్ జాక్ ల మద్య సమన్వయ లోపం మాత్రమె ఈ స్థితి కి కారణం. .ఇక్యతా పోరాటం స్పూర్తితో విద్యార్ధి ,ఉద్యోగ, ప్రజాసంఘాలు ఐక్య సంఘటనతో ప్రజాపోరాటాలను తీవ్రతరం చేయడం ద్వారా మాత్రమె తెలంగాణా విముక్తి కలిగించిన వాళ్ళ మవుతాం .


డాక్టోరల్ ఫెలో ,ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివెర్సిటీ .